• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN TRIVIKRAM ALA VAIKUNTHAPURRAMLOO SITTHARALA SIRAPADU LYRICAL SONG RELEASED TA

‘అల వైకుంఠపురములో’ నుంచి ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ విడుదల..

‘అల వైకుంఠపురములో’ నుంచి ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ విడుదల..

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photos)

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడులైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి సిత్తరాల సిరపడు సాంగ్‌ను విడుదల చేసారు.

  • Share this:
    అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడులైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించారు.  ముఖ్యంగా త్రివిక్రమ్ టేకింగ్‌కు అల్లు అర్జున్ నటన తోడై ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83 కోట్ల షేర్..రూ. 125 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘సిత్తారాలా సిరపడు’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉత్తరాంధ్ర వెర్షన్‌లో సాగే ఈ పాటను విజయ కుమార్ భళ్లా రాసాడు. ఈ పాటను సూరన్న, సాకేత్ కొమండూరి పాడారు. తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలోని రాములో రాములా పాటతో పాటు సామజవరగమన యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్ సాధించిన పాటలుగా టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ఈ పాట కూడా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published: