ఈ యేడాది తెలుగులో సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్నిఇపుడు పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా ప్రదర్శితమైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. హిందీలో ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు సల్మాన్ కూడా ఈ రీమేక్ పై కన్నేసిట్టు సమాచారం. ఇంకోవైపు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. తమిళంలో ఈ చిత్రాన్ని శివకార్తికేయన్ హీరోగా రీమేక్ చేయనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలబడే అవకాశం ఉంది. తమిళంలో ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Bollywood, Kollywood, Salman khan, Shahid Kapoor, Tollywood