రికార్డు రేటుకు ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ రైట్స్.. హీరో ఎవరంటే..

ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 8, 2020, 2:42 PM IST
రికార్డు రేటుకు ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ రైట్స్.. హీరో ఎవరంటే..
ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా హిందీకి వెళ్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని.. ఎక్కడైనా సినిమా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు బాలీవుడ్ నిర్మాతలు.
  • Share this:
ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 150 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ... తాజాగా డిజిటల్ శాటిలైట్ హక్కులను జెమిని వాళ్లు భారీ రేటుకే కొనుగోలు చేసారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. అంటే సినిమా విడుదలైన 87 రోజుల తర్వాత ఈ సినిమా ప్రసారం కానుంది. అది పక్కన పెడితే..ఈసినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడు.

allu arjun trivikram ala vaikunthapurramloo movie hindi remake rights sold whopping price,Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo hindi remake,Ala Vaikuntapurramuloo avpl salman khan, digital platform,sun next release date fix,ala vaikunthapurramloo amazon prime,allu arjun Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo movie 22 days worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections,Ala Vaikuntapurramuloo movie 20 days collections,Ala Vaikuntapurramuloo movie worldwide collections,allu arjun Ala Vaikuntapurramuloo movie 150 crore club,Ala Vaikuntapurramuloo movie collections till now,Ala Vaikuntapurramuloo movie allu arjun,allu arjun industry hit,అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ సినిమా,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో సన్ నెక్ట్స్ రిలీజ్ డేట్,సల్మాన్ ఖాన్ అల వైకుంఠపురములో,సల్మాన్ ఖాన్ హిందీ రీమేక్ రైట్స్
అల్లు అర్జున్,సల్మాన్ ఖాన్ (Twitter/Photo)


ఈ చిత్రం సాధించిన విజయం చూసి సల్మాన్ ఖాన్.. ‘అల వైకుంఠపురములో’ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాడట. అంతేకాదు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. గత కొన్నేళ్లుగా సల్మాన్ ఏ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. అందుకే ఈ రీమేక్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరో క్రేజీ బాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు హిందీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. మొత్తానికి తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 8, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading