అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్.. కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్..

ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల..వైకుంఠపురంలో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నికి సంబంధించిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  సోషల్ మీడియలో ఈ సినిమా కథ ఇదే అంటూ వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: September 8, 2019, 11:56 AM IST
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్.. కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్..
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల..వైకుంఠపురంలో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బన్నికి సంబంధించిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  సోషల్ మీడియలో ఈ సినిమా కథ ఇదే అంటూ వైరల్ అవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా టైటిల్ ప్రకటించినపుడే..‘అల వైకుంఠపురం’ అనేది ఒక ఇల్లు అన్నట్టు చూపెట్టారు. అది జయరామ్ అనే ధనవంతుడు తన ఇంటికి పెట్టుకున్న పేరు. ఆ ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి ఓనర్ ఫ్యామిలీ. రెండోది డ్రైవర్ కుటుంబం. యజమాని జయరామ్. డ్రైవర్ మురళి శర్మ. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి మగపిల్లలు పుడతారు. ధనవంతుల ఇంట్లో అల్లు అర్జున్ జన్మిస్తే.. డ్రైవర్ ఇంట్లో సుశాంత్ జన్మిస్తాడు.

‘అలా వైకుంఠపురంలో’ ఫస్ట్ లుక్


ఆ తర్వాత ఈ ఇద్దరుపిల్లల పుట్టినరోజున వీళ్ల భవిష్యత్తు గురించి చర్చ వస్తోంది. అందులో డ్రైవర్ మురళీ శర్మ మాట్లాడుతూ..ధనవంతుడు కొడుకు ధనవంతుడు అవుతాడు.  డ్రైవర్ కొడుకు  డ్రైవరే అవుతాడంటాడు. దాంతో యజమాని తన కొడుకును డ్రైవర్ దగ్గర.. డ్రైవర్ కొడుకును ధనవంతుడు పెంచుకుంటాడు. మధ్యలో నవదీప్ ఎంట్రీ ఇస్తాడు. వీరి ముగ్గురు మధ్య కథ నడుస్తుందనేది టాక్. ఇక తమ తండ్రులు తమను మార్చుకున్నారని తెలుసుకున్న హీరోలు.. చివరకు ఏం చేసారు. పెంచుకున్న వాళ్లు గొప్పనా.. కన్నవాళ్లు గొప్పనా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. నిజంగానే ఈ స్టోరీతోనే త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడా అనేది చూడాలి. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మన దగ్గర రాజమౌళి తప్పించి ఎవరు సినిమా రిలీజ్ వరకు కథ ఇది అని ఎవరు చెప్పరు. ఇప్పటికే తెలుగులో లీకైన అత్తారింటికీ దారేది వంటి సినిమా కథతో పాటు సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. అలా లీకైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అదే రూట్లో ఈసినిమా కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 8, 2019, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading