నా పేరు సూర్య తర్వాత ఎందుకో తెలియదు కానీ చాలా సైలెంట్ అయిపోయాడు అల్లు అర్జున్. ఆర్నెళ్లుగా ఒక్క సినిమా కూడా పట్టాలెక్కించలేదు బన్నీ. త్రివిక్రమ్ సినిమాను కూడా జనవరిలోనే కన్ఫర్మ్ చేసినా ఇప్పటి వరకు సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సుకుమార్ సినిమా కూడా కన్ఫర్మ్ చేసాడు ఈయన. మాటల మాంత్రికుడి సినిమా పూర్తైన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. గతంలో ఈయన నటించిన ముద్దుగుమ్మలతోనే మరోసారి రొమాన్స్ చేయబోతున్నాడు బన్నీ.
నువ్వు నాకు నచ్చావు తరహాలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్, బన్నీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డిజే సినిమాలో బన్నీతో పాటు రొమాన్స్ చేసిన పూజా హెగ్డే.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో ఆయనతో నటించిన కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది.
మార్చిలోనే షూటింగ్ మొదలు కానుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఆర్నెళ్లలోనే షూటింగ్ పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇది పూర్తైన తర్వాత సుకుమార్ సినిమాను మొదలుపెట్టనున్నాడు అల్లు అర్జున్. మొత్తానికి మళ్లీ కలిసొచ్చిన హీరోయిన్లతోనే రొమాన్స్ చేయబోతున్నాడు అల్లు వారబ్బాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Pooja Hegde, Sukumar, Telugu Cinema, Tollywood, Trivikram