Home /News /movies /

ALLU ARJUN TO GRACE VARUN TEJ STARRER GHANI PRE RELEASE EVENT IN VIZAG SB

Allu Arjun: బన్నీ అక్కడకు వస్తే సినిమా హిట్టేనా.. వరుణ్ తేజ్‌కు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?

వరుణ్ తేజ్ గని ప్రీ రిలీజ్ ఈవెంట్ (ghani movie)

వరుణ్ తేజ్ గని ప్రీ రిలీజ్ ఈవెంట్ (ghani movie)

సినిమాల విషయంలో బన్నీ కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతుంటాడు. తాజాగా బన్నీ వైజాగ్‌‌లో అఖండ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి వైజాగ్ వెళ్తున్నాడు.

    హీరో, హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. చాలామంది హీరోలు తమ సినిమాలకు సంబంధించి రకరకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. సినిమాల షూటింగ్‌ మొదలయ్యే డేట్ నుంచి రిలీజ్ అయ్యే తేదీ వరకు అనేక రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అయితే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తన సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతుంటాడు.'వైజాగ్' అంటే బన్నీకి చాలా ఇష్టం. అందుకే అతనికి విశాఖ అంటే ఓ సెంటిమెంట్ ఉంది. తాను నటించిన ప్రతీ సినిమాలో కూడా ఏదో ఒక సన్నివేశాన్ని అయినా విశాఖ బీచ్లో తీస్తే మంచి హిట్ వస్తుందని నమ్ముతాడు. వైజాగ్ సెంటిమెంట్ కూడా బన్నీకి వర్క్ అవుట్ అయ్యింది. వైజాగ్‌లో బన్నీ తీసిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాయి.

    అయితే తాజాగా మరోసారి వైజాగ్ వెళ్తున్నాడు బన్నీ. అయితే ఈ సారి తన కోసం కాదు.. మరో మెగా హీరో కోసం బన్నీ వైజాగ్‌లో సందడి చేయనున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు. 'గని'. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా విడుదల ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 8న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది.

    తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలలో మరింత జోరు పెంచనున్నారు దర్శక నిర్మాతలు. విడుదల ముందు వరకు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా వినూత్నమైన ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

    అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా గని సినిమాను నిర్మించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని బాగా ఆకట్టుకోనుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    అయితే బన్నీ ... గని మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో... ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని అభిమానులు, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.ఎందుకంటే... బాలయ్య సినిమా అఖండ ఇటీవలే విడుదల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన అఖండ కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను కూడా వైజాగ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు బన్నీ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ గని సినిమా కోసం కోడా బన్నీ రానుండటంతో.. ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అల్లు అర్జున్ వైజాగ్ సెంటిమెంట్... వరుణ్ తేజ్‌కు కూడా కలిసొస్తుందని చెబుతున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Allu Arjun, Ghani Movie, Tollywood news, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు