Allu Arjun to grace Naga Shaurya Ritu Varma Varudu Kaavalenu pre release event
Photo : Twitter
Naga Shaurya : యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా ఫ్యామిలీ డ్రామా'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్గా చేస్తున్నారు. అక్టోబర్ 29న
ఈ చిత్రం విడుదలకానుంది.
యువ హీరో నాగశౌర్య ( Naga Shaurya) హీరో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తోన్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. చిత్రాన్ని అక్టోబర్ 29 న విడుదల చేయనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఈనెల 27న ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. హైదరాబాద్‌లో జరగనున్న వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. అయితే థియేట్రికల్ రిలీజ్‌కి ముందు అల్లు అర్జున్ లాంటీ స్టార్ హీరో ప్రిరిలీజ్ ఈవెంట్‌కు రావడం సినిమా ఓపెనింగ్స్‌కు భారీ ఊపునిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చాలా ఆహ్లదకరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ ట్రైలర్‌ను ఫన్ అండ్ ఏమోషన్ సీన్స్‌తో నింపారు.
ముఖ్యంగా రీతూ వర్మను హైలెట్ చేశారు. పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతీ సీజన్లో ఆవిడే విన్నర్ తెలుసా..అంటూ వెన్నెల కిశోర్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎన్ని రోజుల అయ్యిందిరా.. చీరలు, చూడీదార్లు చూసి అనే డైలాగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. భూమి, ఆకాష్ పాత్రల్లో రీతూ వర్మ, నాగ శౌర్యలు అదరగొట్టారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైప ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్‌ను చిత్రబృందం విడదల చేసిన సంగతి తెలిసిందే. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాట ఇన్స్‌స్టాంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. తెలంగాణ జానపదం 'దిగు దిగు దిగు నాగ' (digu digu digu naaga song) అనే పాటను మార్చి అదే బాణీలో కొత్త లిరిక్స్‌తో అదరగొట్టారు.
థమన్ సంగీతం అందించగా ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రముఖ హిందీ సింగర్ శ్రేయా ఘోషల్ పాడారు. యూట్యూబ్‌లో విడుదలై ఈ పాట నెటిజన్స్‌ను ఎంతోగాను ఆకట్టుకుంటోంది.
ఈ పాటపై కొందరు విమర్శలు చేశారు. దిగు దిగు నాగ అంటూ వచ్చిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా మసాలా పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. అంతేకాదు డాన్స్ మాస్టర్ శేఖర్‌పై మండిపడ్డారు. ఈ సినిమాలో నాగశౌర్య, రీతువర్మ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తుండగా... నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.