హోమ్ /వార్తలు /సినిమా /

18 Pages | Nikhil : నిఖిల్ 18 పేజెస్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్..

18 Pages | Nikhil : నిఖిల్ 18 పేజెస్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్..

Allu Arjun to attend Nikhil Siddhartha Anupama Parameswaran 18 Pages pre release event Photo : Twitter

Allu Arjun to attend Nikhil Siddhartha Anupama Parameswaran 18 Pages pre release event Photo : Twitter

Nikhil Siddhartha : టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ బెల్ట్‌లో మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కార్తికేయ2 లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్‌ సిద్దార్థ ( Nikhil Siddhartha ), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటిస్తున్న మరో చిత్రం '18 పేజెస్‌' (18 Pages). రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సుకుమార్‌ (Sukumar) కథ అందించారు. ఇక ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్‌ డైరెక్టర్‌ సూర్య ప్రతాప్‌ (Palnati Surya Pratap) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలకానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ (Allu Arjun) వస్తున్నట్లు ప్రకటించింది టీమ్. ఇక తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రచార చిత్రాలతో మంచి బజ్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

ఇక నిఖిల్ లాస్ట్ మూవీ కార్తికేయ 2 సినిమా విషయానికి వస్తే.. చిన్న సినిమాగా సాదాసీదాగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి ఈసినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర  120 కోట్లకు పైగా వసూలు చేసి, పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా కేక పెట్టించింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా ఇరగదీసింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ లేటెస్ట్ థ్రిల్లర్  స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషాల్లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్స్‌లో ఓ ఊపు ఊపిన కార్తికేయ2 ఓటీటీలో  కూడా మంచి వ్యూస్‌ను సంపాదిస్తోంది.

ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి తత్త్వం గురించి చెప్పే డైలాగులు ఆడియన్స్‌ను గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది.  ముఖ్యంగా శ్రీకృష్ణుడిని మించిన ఫిలాసఫర్, డాక్టర్, సైంటిస్ట్, గైడ్, వ్యవసాయదారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న కార్తికేయ3కి మరింత బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే కార్తికేయ-3 సినిమాపై అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. ఇక అది అలా ఉంటే కార్తికేయ 2 ద్వారక టెంపుల్ నేపథ్యంలో సాగగా.. కార్తికేయ-3 సినిమా అయోధ్య రామమందిరం నేపథ్యంలో రానుందని తెలుస్తోంది. ఇక ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని.. అతి తర్వలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

ఇక ప్రస్తుతం 118 పేజేస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక నిఖిల్ సిద్దార్థ పర్సనల్ విషయానికి వస్తే.. నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు.  అంతకంటే ముందు హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేశాడు. నిఖిల్ హైదరాబాద్‌లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు.  ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

First published:

Tags: 18 pages movie, Allu Arjun, Anupama Parameswaran, Nikhil Siddharth, Tollywood news

ఉత్తమ కథలు