మాటల మాంత్రికునితో పాటు మరో ముగ్గురిని లైన్లో పెట్టిన బన్ని

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో ముగ్గురు దర్శకులను లైన్‌లో పెట్టాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 1, 2019, 7:03 AM IST
మాటల మాంత్రికునితో పాటు మరో ముగ్గురిని లైన్లో పెట్టిన బన్ని
అల్లు అర్జున్, త్రివిక్రమ్
  • Share this:
‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విపలమైంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్..తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ సారి కొడితే బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉండాలని కథల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. లేటైనా సరే త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీతో వీళ్లిద్దరు హాట్రిక్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం.మార్చిలో ఈ  సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి దసరాకు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమా తర్వాత అల్లు అర్జున్, మురుగదాస్‌తో  ఒక డిఫరెంట్ మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గ కథను మురుగదాస్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ  సినిమా ఈ ఇయర్ ఎండింగ్ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. మురుగదాస్ సినిమాతో పాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్..నానితో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్ని, విక్రమ్ కుమార్‌లతోొ చేయబోయే సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వీళ్లిద్దరు పరశురామ్‌తో ఒక సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఏడాదికి పైగా ఖాళీ ఉన్న అల్లు వారి అబ్బాయి...ఇపుడా గ్యాప్‌ను ఒకేసారి ఫిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఇవి కూడా చదవండి 

మహేష్ బాబు స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా..

బాలయ్య భామతో వెంకీ మామ..ఇంతకీ ఎవరనేగా...

వెంకీ సినిమాపై మోజు పడ్డ సల్మాన్...అంతేగా..అంతేగా..
First published: February 1, 2019, 7:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading