తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ (Allu Arjun) గండం ఉందా.? అల్లు అర్జున్ గండం ఏంటీ? అనుకుంటున్నారా.. ఈ విషయంపై సోషల్ మీడియా (Social Media) లో సెటైరిక్ పోస్టులు పడుతున్నాయి. 2020లో సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంటపురం మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ (Industry Record) కలెక్షన్‌లను వసూలు చేసింది. ఆ సమయంలో కరోనా కేసులు అంతర్జాతీయంగా అప్పుడప్పుడే వస్తున్నాయి. ఈ సినిమా హిట్ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగిలింది. అదే కరోనా కేసులు, లాక్‌డౌన్ దీంతో బాక్స్ ఆఫీస్ (Box Office) కలెక్షన్‌ల మాట అటువుంచి అసలు సినిమా ఆడితే చాలు అనే అభిప్రాయం వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ సినిమా పుష్ఫ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద కలెక్షన్‌లు వస్తాయా అనే అనుమానం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
Allu Arjun Emotional: కంటతడి పెట్టిన అల్లు అర్జున్.. "పుష్ప" ఈవెంట్‌లో ఎమోషనల్!
ఇలా చర్చకు కారణం అల్లు అర్జున్ పుష్ప సినిమా హిట్ (Movie Hit) అవ్వడం.. భారీగా కలెక్షన్‌లు రావడం. తరువాత కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళీ, జూ.ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడింది.
Bollywood: ఆ బైక్ నంబర్ ప్లేట్ నాదే.. బాలీవుడ్ హీరోపై పోలీసులకు ఫిర్యాదు!
ఈ సినిమా కోసం భీమ్లానాయక్ (Bheemla Nayak), సర్కారువారిపాట సినిమకూడా వాయిదా వేసుకున్నాయి. తీరా అన్ని వాయిదా వేసుకొన్నాక ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆర్ఆర్ ఆర్ (RRR) రిలీజ్ వాయిదా వేశారు. దీంతో మళ్లీ పెద్ద హిట్ ఇప్పట్లో లేనట్లే అని ఫ్యాన్స్ చెప్పుకొంటున్నారు.
రికార్డు కలెషన్లతో పుష్ప..
డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది.
Nikki Tamboli: కిక్కెక్కించే చూపులతో నిక్కి తంబోలి.. లేటెస్ట్ హాట్ ఫోటో షూట్!
ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ. హిందీలో మొదటి రోజు కేవలం 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది పుష్ప. ఆ తర్వాత వరసగా రోజుకు కనీసం 2 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ జోరు మరింత పెరిగిపోయింది. హిందీలో కూడా కొత్త సినిమాలేవీ విడుదల కావడం లేదు. దాంతో అది క్యాష్ చేసుకుంటుంది సినిమా. టాక్ కూడా బాగానే ఉండటంతో హిందీలో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikuntapuramlo, Allu Arjun, Box Office Collections, Corona casess, Pushpa