స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెకెక్కించబోతున్నారు. దీంతో హిందీ నుండి కూడా ఓ స్టార్ హీరోను ఈ సినిమాలో విలన్‌గా చూపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృంతం. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమంటే.. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. బన్నీకు ఎలాగో నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకుంటారని తెలిసింది. అంతేకాదు ఒక్క హిందీ మాత్రమే కాదు.. వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా తన వాయిస్‌కు బన్నినే స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక అల్లు అర్జున్ తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.