ఆసక్తి రేకిత్తిస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని డిలీట్ సీన్..

Ala Vaikunthapurramloo Deleted scene |ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాలో డిలీట్ చేసిన సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: March 16, 2020, 8:45 PM IST
ఆసక్తి రేకిత్తిస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని డిలీట్ సీన్..
అల్లు అర్జున్,సుశాంత్ అల వైకుంఠపురములో డిలీట్ సీన్ (Twitter/Photo)
  • Share this:
Ala Vaikunthapurramloo Deleted scene | ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ‘జులాయి’, సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి వీళ్ల కాంబినేషన్‌లో హాట్రిక్ హిట్ నమోదు చేసింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసారు. త్వరలో శాటిలైట్‌లో ప్రసారం కానుంది.  ఇక  ఈ సినిమాకు సంబంధించిన అన్నివీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఒక డిలీట్ సీన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సుశాంత్‌ను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ తన అలవాట్ల గురించి చెబుతాడు. తనకు ఇటీవెల షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేయడం అలవాటు అయిందన్నాడు. దాని వల్ల తనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అల్లు అర్జున్.. సుశాంత్‌తో చెబుతాడు. ఆ తర్వాత నిన్ననే అర్జున్ రెడ్డి 2 అనే షార్ట్ ఫిల్మ్ తీశానిని చెప్పి ఓ వీడియోను సుశాంత్‌కు చూపిస్తాడు. ఆ వీడియో చూసి సుశాంత్ షాక్ అవుతాడు. ఒకవేళ ఈ సన్నివేశాన్ని సినిమాలో పెడితే.. బాగుండేదని ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: March 16, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading