Allu Arjun - Pushpa: కళ్లు చెదిరే రేటుకు అల్లు అర్జున్ ‘పుష్ప’ నైజాం రైట్స్..

పుష్ఫ మూవీ పోస్టర్

Allu Arjun - Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాాజగా ఈ సినిమా నైజాం రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    Allu Arjun - Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే  అల్లు అర్జున్ పుట్టినరోజు  సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.

    ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో నటించనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. నైజాంలో భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో పుష్ఫ మూవీ నైజాం (తెలంగాణ) రైట్స్ రూ. 40 కోట్లకు డీల్ పూర్తైయినట్టు సమాచారం.

    పుష్పలో అల్లు అర్జున్ (Image: Instagram)


    పుష్ఫ సినిమా విషయానికొస్తే..  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను కేరళ అడవుల్లో కాకుండా.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యం  అడవుల్లో ఈ సినిమాను  షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో  పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు.  ముందుగా ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇప్పటికే ఎండాకాలంలో మెగా ఫ్యామిలీకి చెందిన ఆచార్యతో పాటు వకీల్ సాబ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 13న విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన లుక్‌లో అల్లు అర్జున్.. చేతిలో గొడ్డలి పట్టుకొని ఎర్ర చందనం చెట్లు నరికిన తర్వతా తన తోటి వాళ్లతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. మొత్తంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: