Pushpa : పుష్ప నుంచి ఊర మాస్ సాంగ్ విడుదల.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Pushpa Allu Arjun Photo : Twitter

Pushpa : అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలైంది.

  • Share this:
    అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పుష్ప సినిమా ప్రస్తుతం  షూటింగ్ జరుపుకుంటుంది. అది అలా ఉంటే ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసింది చిత్రబృందం. అందులో భాగంగా ఊరమాస్ సాంగ్  దాక్కో దాక్కో మేక అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో లిరిక్స్, మ్యూజిక్‌ వింటుంటే ఫ్యాన్స్‌కు పునకాలు రావడం ఖాయం అంటున్నారు.. సాంగ్ విన్న నెటిజన్స్. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను సుకుమార్ రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. అయితే ఆ వార్త నిజం అని తేలింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో విలన్’గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన చేస్తోంది. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.





    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందట. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమాను చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: