Allu Arjun | Pushpa : ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్.. సౌత్ ఇండియాలో ఫస్ట్ సాంగ్..

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun | Pushpa : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా వాటిలో మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ నుంచి ఊరమాస్ సాంగ్ దాక్కో దాక్కో మేక అంటూ ఫస్ట్ సింగిల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమాలో విలన్’గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు జంటగా రష్మిక మందన చేస్తోంది. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.


    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందట. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా వచ్చే క్రిస్మస్‌కు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    ఇవి కూడా చూడండి :

    Vishwak Sen Paagal Twitter Review : విశ్వక్ సేన్ పాగల్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

    Poorna : పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

    RRR : అర్ధనగ్నంగా పోజులిచ్చిన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఆలియా భట్.. పిక్స్ వైరల్..

    Anchor Varshini : బికినీలో యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

    Premi Viswanath : బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెరిసిపోతున్న వంటలక్క...
    Published by:Suresh Rachamalla
    First published: