Allu Arjun | Pushpa : ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. ఇండియాలో మొదటిసారి..

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun | Pushpa : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.

  • Share this:
    అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ చిత్ర ప్రమోషన్‌లో ఇటీవల ఓ మాస్ పాటను విడుదల చేశారు. ఈ సినిమాలోని తొలి పాటను ఆగస్టు 13న రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఆల్ టైమ్ రికార్డ్‌‌ను నమోదు చేసింది. తెలుగులో ‘దాక్కో దాక్కో మేక’,(DaakkoDaakkoMeka) కన్నడలో ‘జొక్కే జొక్కే మేకే’, తమిళంలో ‘ఒడు ఒడు ఆడు’, మలయాళంలో ‘ఒడు ఒడు ఆడే’, హిందీలో ‘జాగో జాగో బక్రే’ అంటూ సాగే ఈ పాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ దుమ్ము లేపుతోంది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో తెలుగు పాట ‘దాక్కో దాక్కో మేకా మొదటి స్థానంలో నిలవగా కన్నడ పాట 9వ స్థానంలో నిలిచింది. ఇక తమిళ వెర్షన్‌ 11వ స్థానంలో ట్రెండ్ అవుతుండగా, మలయాళం వెర్షన్‌ 17వ స్థానంలో నిలిచాయి. యూట్యూబ్‌లో 11 రోజుల నుంచి ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ పాట భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచినట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

    ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. దీంతో ఈ చిత్రం షూటింగు ఎక్కువ భాగాన్ని అటవీ నేపథ్యంలో జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరించిన చిత్రబృందం.. ఆ మధ్య ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించింది. కొంత భాగాన్ని తమిళ నాడులోని తెన్ కాశీ పరిసరాలలో నిర్వహించారు. అక్కడ కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుపుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్’లో జగురుతోంది.


    ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చి సూపర్ హిట్ అయినవే. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే ఓ స్మగ్లర్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న ట్రైబల్ యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: