హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ఫ’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. కెవ్వు కేక పెట్టాల్సిందే..

Allu Arjun - Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ఫ’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. కెవ్వు కేక పెట్టాల్సిందే..

పుష్ప సినిమాలోని కీలకమైన సన్నివేశం కూడా విడుదలకు ముందే లీక్ అయింది. ఈ మధ్యే మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ సైతం విడుదలకు ముందే లీక్ అయింది. దాంతో అధికారికంగా చెప్పిన సమయం కంటే ముందుగానే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పుష్ప సినిమాలోని ఓ మేజర్ ఫైట్ సీన్ లీక్ అయింది.

పుష్ప సినిమాలోని కీలకమైన సన్నివేశం కూడా విడుదలకు ముందే లీక్ అయింది. ఈ మధ్యే మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ సైతం విడుదలకు ముందే లీక్ అయింది. దాంతో అధికారికంగా చెప్పిన సమయం కంటే ముందుగానే విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పుష్ప సినిమాలోని ఓ మేజర్ ఫైట్ సీన్ లీక్ అయింది.

Allu Arjun - Pushpa Raj Prelude | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్  సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...

  Allu Arjun - Pushpa Raj Prelude | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్  సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. కేవలం ముహూర్తం షాట్ తర్వాత ఎలాంటి షూటింగ్ జరుపుకోని ‘పుష్ప’ సినిమా రెగ్యులర్ షూటింగ్  గతేడాది నవంబర్‌లో ప్రారంభమైంది.  ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.

  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ , తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యంతో పాటు ఖమ్మం అడవుల్లో జరిగింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో  పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. ఈ సినిమాను ఆగష్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో పాటు బన్ని లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ప్రీల్యూడ్ పుష్పరాజ్ అంటూ విడుదల చేయనున్నారు.


  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’  పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే  ఈ సినిమాకు సంబంధించిన తర్వాతి షెడ్యూల్‌ను  చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఒకపుడు సత్య మంగళం అడవులు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడ్డాగా ఉండేది. ఇపుడు అక్కడే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ సంపాదించే పనిలో పడింది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా యూనిట్‌లో ఒకరికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.   గతేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు.  ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి..సుకుమార్ దర్శకత్వలో ‘పుష్ప’సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Mythri Movie Makers, Rashmika mandanna, Sukumar, Tollywood

  ఉత్తమ కథలు