స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంవత్సరం ప్రారంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి.. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్లో కనబడుతూ.. లారీ డ్రైవర్గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది.
కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్Photo : Twitter
ఇక ఆ మధ్య విడుదలైన ఫస్టులుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే సుకుమార్ సినిమాల్లో మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అంతేకాదు ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్ కోసం చరణ్ సరసన నటించిన కైరా అద్వానీని తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని సంప్రదించారని అంతేకాదు ఆమె స్పెషల్ సాంగ్లో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో రానుందని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మెత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రీసెంట్ గా అల్లు అర్జున్.. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 21వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.