అల్లు అర్జున్‌తో చరణ్ భామ రొమాన్స్.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తోన్న సుకుమార్..

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: April 12, 2020, 8:46 AM IST
అల్లు అర్జున్‌తో చరణ్ భామ రొమాన్స్.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తోన్న సుకుమార్..
అల్లు అర్జున్ సినిమాకు బాలీవుడ్‌లో సీక్వెల్ రావడం ఏంటి.. అయినా మన హీరో తెలుగులోనే బిజీగా ఉన్నాడు కదా అనుకుంటున్నారా..? కొన్నిసార్లు అంతే.. మన దగ్గర్నుంచి కథలు తీసుకుని మనకు తెలియకుండా బాలీవుడ్‌లో సీక్వెల్స్ చేస్తుంటారు.
  • Share this:
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది.

కాగా ఇటీవల విడుదలైన ఫస్టులుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే సుకుమార్ సినిమాల్లో మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అంతేకాదు ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ సాంగ్ కోసం చరణ్ సరసన నటించిన కైరా అద్వానీని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భామ ప్రస్తుతం హిందీలో ఇరగదీస్తోంది. దీంతో ఈ ఐటెమ్ సాంగ్ వల్ల హిందీలో కూడా మంచి మార్కెట్ రావాడినికి అవకాశం ఉందని చిత్రబృదం భావిస్తోందట. ఇక చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మెత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: April 12, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading