ALLU ARJUN SUKUMAR PUSHPA WILL HAVE A NATIONAL AWARD WINNING ACTOR BOBBY SIMHA TA
పుష్పలో అల్లు అర్జున్‌కు పోటీగా నేషనల్ అవార్డు విన్నర్‌ను దింపుతున్న సుకుమార్..
సుకుమార్ మూవీలో అల్లు అర్జున్ కొత్త లుక్ (Twitter/Photo)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో విలన్‌గా జాతీయ అవార్డు గ్రహీతను తీసుకోవాలనుకున్నట్టు సమాచారం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఇటీవలే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్ కేక పెట్టిసోంది. రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే తాజాగావస్తోన్న సమాచారం మేరకు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి ఏప్రిల్ నెల మొత్తం డేట్స్ కేటాయించాడట. అయితే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ క్యాన్సల్ అయింది. ఈ నేపథ్యంలో వేరే సినిమాకు సమస్య రావడంతో డేట్స్ కుదరక ఈ సినిమా నుండి తప్పుకున్నాడట తమిళ స్టార్. దీంతో ఆయన పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా మరో స్టార్‌ను పరిశీలిస్తోంది. ఇంకో విషయం ఏమంటే విజయ్ సేతుపతి పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందట ఈ సినిమాలో. దీంతో తమిళంలో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు, విజయ్ సేతుపతి అభిమానులతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
అల్లు అర్జున్, విజయ్ సేతుపతి (Twitter/Photo)
దీంతో ఆయన స్థానంలో హీరో ధనుంజయ్‌ను తీసుకుంటున్నట్గుగా సమాచారం. కానీ తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోను ఢీ కొట్టే పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. అందుకే ఈ పాత్ర కోసం తమిళ నటుడు జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహాను తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో యాక్ట్ చేసేందకు బాబీ సింహా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక తమిళంలో బాబీ సింహాకు మంచి పేరు ఉంది. అందుకే చిత్ర బృందం అతని పేరు పరిశీలించింది. అంతేకాదు విలన్‌గా బాబీ సింహా ఇంతకు ముందు పలు చిత్రాల్లో తన నటనతో ఎలా అలరించాడో తెలిసిందే కదా.
అల్లు అర్జున్, బాబీ సింహా (Twitter/Photo)
ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెకెక్కించబోతున్నారు. దీంతో ఈ సినిమాలో బాబీ సింహాతో పాటు మరో ప్రముఖ హీరో సునీల్ శెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది. మరో పాత్రలో నివేదా థామస్ కనిపించనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో అదిరిపోయే ఓ ఐటెమ్ సాంగ్ ఉండనుందని.. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేటా అందాలు ఆరబోయనుందని తెలుస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.