Allu Arjun Pushpa - Buchi Babu: ‘పుష్ప’ ఒక్కడే 10 ‘KGF’లతో సమానం.. కాస్త ఓవర్ అయినట్లుంది బుచ్చిబాబు గారూ..!

పుష్ప Vs కెజియఫ్ 2 (Pushpa Vs KGF)

Allu Arjun Pushpa - Buchi Babu: బాహుబలి(Bahubali) తర్వాత సౌత్ ఇండియన్ సినిమా కీర్తి ప్రతిష్టలను ఆ స్థాయిలో నిలబెట్టింది కెజియఫ్(KGF). అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహకందని అద్భుతాలు చేసింది. ఇలాంటి సెన్సేషనల్ సినిమాపై కామెంట్ చేయాలంటే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే.

  • Share this:
బాహుబలి తర్వాత సౌత్ ఇండియన్ సినిమా కీర్తి ప్రతిష్టలను ఆ స్థాయిలో నిలబెట్టింది కెజియఫ్. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. సౌత్‌లో మిగిలిన ఇండస్ట్రీలు చాలా చిన్నచూపు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజిఎఫ్ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఏకంగా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమా విడుదలయ్యే వరకు యశ్ అంటే ఎవరో తెలియదు.. ప్రశాంత్ నీల్‌తో కనీసం పరిచయం లేదు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఊహకందని అద్భుతాలు చేసింది. మరీ ముఖ్యంగా కేజిఎఫ్ సినిమాలో ఎలివేషన్స్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంటాయి. ఇప్పటికి కూడా ఏదైనా సినిమాలో కాస్త హీరోను ఎలివేట్ చేస్తే కేజిఎఫ్ ఎలివేషన్ అనుకుంటున్నావా అంటారు. ఇలాంటి సెన్సేషనల్ సినిమాపై కామెంట్ చేయాలంటే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. అయితే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాత్రం కేజిఎఫ్ సినిమాపై సంచలన కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాను పొగిడే క్రమంలో ఏకంగా కేజిఎఫ్ సినిమా కిందకు దించేశాడు.

సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. సగం సినిమా పూర్తయిన తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ముందు పుష్ప పార్ట్ 1 సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కేవలం 15 శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
kgf vs pushpa,director buchi babu sana about pushpa movie,pushpa vs kgf,kgf chapter 2 vs pushpa,buchi babu about pushpa,allu arjun pushpa,pushpa is equal to 10 kgf,buchhi babu about kgf and pushpa,pushpa movie updates,బుచ్చిబాబు,బుచ్చిబాబు ఉప్పెన దర్శకుడు,పుష్ప సినిమాపై కామెంట్ చేసిన బుచ్చిబాబు,పుష్ప 10 కెజియఫ్‌లతో సమానం
పుష్ప Vs కెజియఫ్ 2 (Pushpa Vs KGF)

ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు చూశాడు. ఈయన సుకుమార్ ప్రియ శిష్యుడు. అందుకే అల్లు అర్జున్ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే చూడగలిగాడు. అయితే చూసిన తర్వాత ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
kgf vs pushpa,director buchi babu sana about pushpa movie,pushpa vs kgf,kgf chapter 2 vs pushpa,buchi babu about pushpa,allu arjun pushpa,pushpa is equal to 10 kgf,buchhi babu about kgf and pushpa,pushpa movie updates,బుచ్చిబాబు,బుచ్చిబాబు ఉప్పెన దర్శకుడు,పుష్ప సినిమాపై కామెంట్ చేసిన బుచ్చిబాబు,పుష్ప 10 కెజియఫ్‌లతో సమానం
పుష్ప Vs కెజియఫ్ 2 (Pushpa Vs KGF)

నేను ఆల్రెడీ పుష్ప మొదటి భాగం చూశాను.. ఇది చూసిన తర్వాత కేజిఎఫ్ సినిమాలు 10 కలిపితే ఎలా ఉంటాయో అలా ఉంది.. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ నటన, సుకుమార్ ఎలివేషన్స్ చూసిన తర్వాత 10 కేజిఎఫ్‌లు ఒకేసారి చూసిన ఫీలింగ్ నాకు వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ స్థాయిలో అంచనాలకు పెంచితే రేపు ఏ మాత్రం తగ్గినా కూడా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరి నిజంగానే పుష్ప బుచ్చిబాబు చెప్పిన రేంజ్‌లో ఉంటుందా అనేది చూద్దాం.
Published by:Praveen Kumar Vadla
First published: