బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సర్ప్రైజ్ గిఫ్ట్..

అల్లు అర్జున్ తన బర్త్ డే అయిన ఏప్రిల్ 8వ తేదిన తన 20వ సినిమాకు సంబంధించిన ఒక ప్రకటన చేయనున్నాడు. ఈ సందర్భంగా మైత్రీ మూవీస్ వాళ్లు ట్విట్టర్‌లో ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. 

news18-telugu
Updated: April 6, 2020, 9:38 PM IST
బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ సర్ప్రైజ్ గిఫ్ట్..
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
  • Share this:
అల్లు అర్జున్ తన బర్త్ డే అయిన ఏప్రిల్ 8వ తేదిన తన 20వ సినిమాకు సంబంధించిన ఒక ప్రకటన చేయనున్నాడు. ఈ సందర్భంగా మైత్రీ మూవీస్ వాళ్లు ట్విట్టర్‌లో ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచనల విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘శేషాచలం’ అడవుల నేపథ్యంలో  అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ శేషాచలం అనే రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లో ఏమబ్బా, అందరూ బాగుండారా, మీరు ఎపుడెప్పుడా అని అని చూస్తాండే.


ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది. Ready కాదండబ్బా అంటూ రాయలసీమ యాసలో ట్వీట్ చేసారు. మొతానికి ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇపుడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ సర్ఫ్రైజ్ ఇవ్వనున్నట్టు తెలిజేస్తూ ట్వీట్ చేయడం చూసి బన్ని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.  ఈ సినిమాలో బన్ని రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 6, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading