క్రేజీ టైటిల్‌తో వస్తోన్న బన్నీ.. మొదటిసారి అల్లు అర్జున్ అలా..

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: April 7, 2020, 1:10 PM IST
క్రేజీ టైటిల్‌తో వస్తోన్న బన్నీ.. మొదటిసారి అల్లు అర్జున్ అలా..
అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar)
  • Share this:
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది.

కాగా సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘పుష్ప’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారట చిత్రబృందం. సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప అని తెలుస్తోంది. సో సినిమా హీరోయిన్ పేరు మీద వస్తోందన్న మాట. దీనికి సంబందించి రేపు ఉదయం 9 గంటలకు ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: April 7, 2020, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading