అల్లు అర్జున్, సుకుమార్ సినిమాకు రేపే ముహూర్తం..

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టనున్నారు.

news18-telugu
Updated: October 29, 2019, 8:31 PM IST
అల్లు అర్జున్, సుకుమార్ సినిమాకు రేపే ముహూర్తం..
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టనున్నారు.
  • Share this:
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ‘సామజవరగమన’ పాటతో పాటు రాములో రాములో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. తాజాగా అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 20వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు రేపు పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ  కొట్టనున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న ప్రోమో విడుదల చేసారు.సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే టైటిల్ విషయంలో సుకుమార్ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ‘ఆర్య’,ఆర్య2’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.ఇక
Published by: Kiran Kumar Thanjavur
First published: October 29, 2019, 8:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading