అల్లు అర్జున్, సుకుమార్ సినిమాకు ముహూర్తం ఖరారు..

‘నా పేరు నా ఇల్లు ఇండియా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో కొత్త సినిమాకు స్టార్ట్ చేసాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసాడు. తాజాగా ఈ సినిమాను ఈ నెలలో కొబ్బరికాయ కొట్టనున్నారు.

news18-telugu
Updated: August 2, 2019, 10:32 AM IST
అల్లు అర్జున్, సుకుమార్ సినిమాకు ముహూర్తం ఖరారు..
అల్లు అర్జున్ సుకుమార్
  • Share this:
‘నా పేరు నా ఇల్లు ఇండియా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో కొత్త సినిమాకు స్టార్ట్ చేసాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసాడు. దాదాపు యేడాదిన్నరకు పైగా ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఇపుడు వరుసగా సినిమాలు ఒప్పేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ‘నేను నాన్న’ అనే టైటిల్ అనుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు.  మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను ఈ నెలలోనే కొబ్బరికాయ కొట్టనున్నారు. ఈ సినిమాను కూడా ‘ఐకాన్’తో పాటు ఒకేసారి షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

allu arjun sukumar movie starts very soon this month, allu arjun,allu arjun sukumar movie,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,sukumar twitter,sukumar instagram,sukumar facebook,allu arjun new movie,sukumar,allu arjun about sukumar,allu arjun movies,allu arjun sukumar,sukumar about allu arjun,allu arjun sukumar new movie,allu arjun 20th movie,allu arjun upcoming movie,allu arjun latest movie,allu arjun 20th movie updates,allu arjun dance,allu arjun sukumar movie updates,allu arjun 20th movie with sukumar,allu arjun next movie,tollywood,telugu cinema,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ మూవీ త్వరలో ప్రారంభం,అల్లు అర్జున్,అల్లు అర్జున్ త్రివిక్రమ్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
సుకుమార్‌తో నెక్ట్స్ మూవీ


సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే టైటిల్ విషయంలో సుకుమార్ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ‘ఆర్య’,ఆర్య2’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్.. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య సినిమాలు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు అల్లు అర్జున్.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...