హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Pushpa: బన్నీ మరో స్టైలిష్ లుక్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

Allu Arjun - Pushpa: బన్నీ మరో స్టైలిష్ లుక్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

రెండేళ్ల కింద విడుదలై సంచలన విజయం సాధించిన బాట్లా హౌజ్ సినిమాను తెరకెక్కించింది నిఖిల్ అద్వానీనే. అప్పట్లో ఈయన పార్టీకే బాంబే వెళ్లాడు బన్నీ. అక్కడే చాలా సేపు ఆయనతో మాట్లాడాడని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఉందని.. అవకాశం ఉంటే హిందీలో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని బన్నీ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల కింద విడుదలై సంచలన విజయం సాధించిన బాట్లా హౌజ్ సినిమాను తెరకెక్కించింది నిఖిల్ అద్వానీనే. అప్పట్లో ఈయన పార్టీకే బాంబే వెళ్లాడు బన్నీ. అక్కడే చాలా సేపు ఆయనతో మాట్లాడాడని తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఉందని.. అవకాశం ఉంటే హిందీలో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని బన్నీ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun - Pushpa: 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ లుక్‌కి సంబంధిచిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది

స్టైలిష్‌స్టార్‌.. ఈ పేరున్న సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ఒకే ఒకడు మన టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌. మొదటి సినిమా సమయంలో వచ్చిన విమర్శలకు ధీటుగా బన్నీ చేంజ్‌ ఓవర్‌ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి సౌత్‌కు అల్లు అర్జున్‌ స్టైల్‌ ఐకాన్‌ అయ్యాడనే చెప్పాలి. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో తన సన్నిహితుడు పుట్టినరోజు వేడుకకి బన్నీ హాజరయ్యాడు. ఈ వేడుకలో బన్నీ లుక్‌ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బయట బన్నీ కనిపించిన లుక్‌కి, ఈ లుక్‌కి పెద్ద తేడా లేదు. రగ్డ్‌గా కనిపిస్తున్న బన్నీ లుక్‌ చాలా కూల్‌గా ఉంది. బన్నీ కూల్‌ చూసిన తన ఫ్యాన్స్‌ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైర్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేష‌న్‌లో ఆర్య‌, ఆర్య 2 సినిమాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు భిన్నంగా ‘పుష్ప‌’ సినిమాను సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ చేయ‌న‌టువంటి మాసీ లుక్‌ను ‘పుష్ప‌’ సినిమాలో బ‌న్నీ చేస్తున్నాడు. శేషాల‌చ‌ల అడ‌వుల్లో మాత్రమే దొరికే ఎర్ర‌చంద‌నం, దానికి సంబంధించిన స్మ‌గ్లింగ్‌పై ‘పుష్ప‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు సుకుమార్ చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టీజర్‌ను బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్‌ను కేర‌ళ‌, మారేడు మిల్లి, రంప‌చోడ‌వ‌రంలోని అట‌వీ ప్రాంతాల్లో చిత్రీక‌రించారు. ఇప్పుడు తెన్‌కాశీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. బ‌న్ని, ర‌ష్మిక మంద‌న్నల‌పై రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చిత్ర యూనిట్ చిత్రీక‌రిస్తుంది. దీంతో పాటు ఓ పాట‌ను కూడా చిత్రీక‌రిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Pushpa Movie

ఉత్తమ కథలు