news18-telugu
Updated: September 27, 2019, 11:48 AM IST
‘సైరా నరసింహారెడ్డి’పై బన్నీ ట్వీట్ (Twitter/Photo)
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి సైలెంట్ మెయింటెన్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా అల్లు అర్జున్ దూరంగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిచ్చినట్లైంది. ఈ సినిమాను రామ్ చరణ్..తన సొంత కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో ఒకేసారి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. అలాంటి మెగా ఈవెంట్‌కు అల్లు అర్జున్ ఎందుకు రాలేదనే ప్రశ్నఅందరి మదిలో మొదలైంది. ప్రస్తుతం బన్ని..త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్లో బిజీగా ఉండటంతో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదా ? లేకపోతే.. మరోదైనా వ్యక్తిగత కారణాలతో ఈ ఈవెంట్‌కు రాలేకపోయారా ? లేకపోతే బన్ని రావాలని అసలు ఆహ్వానమే అందలేదా అనే డౌట్స్ అభిమానుల మనసుల్లో మొదలుతున్నాయి.

చిరు అల్లు అర్జున్
ముందుగా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 18న అంటూ ప్రకటన వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటూ ప్రకటించారు. అంతలో కేటీఆర్ రావడం లేదని మళ్లీ చిత్ర యూనిట్ క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి, రాజమౌళి, పవన్ కళ్యాణ్‌లతో కూడిన ఇన్విటేషన్ కార్డ్ వచ్చింది.

అల్లు అర్జున్, రామ్ చరణ్,పవన్ కళ్యాణ్ (File Photos)
అందులో ఎక్కడా అల్లు అర్జున్ ప్రస్తావన లేదు. అంతేకాదు ఎక్కడా బన్ని‘సైరా’ ఈ ప్రీ రిలీజ్‌కు హాజరవతారన్న ప్రకటన కూడా లేదు. దాంతో అల్లు అర్జున్ హర్ట్ అయినట్టు సమాచారం. కనీసం తాను వస్తున్నట్లు కానీ, వస్తానని కానీ నిర్మాత హోదాలో రామ్ చరణ్ ప్రకటనైనా చేస్తే బాగుండేదిని బన్ని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. దీంతో పిలవని పేరంటానికి పోవడం దేనికో అనుకుంటూ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు. అంతేకాదు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయంలో కనీసం స్పందిచడం లేదని బన్ని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్..ఎపుడైతే..‘ఒక మనసు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి అడిగితే చెప్పను బ్రదర్.. అంటూ ఎపుడైతే చెప్పాడో.. అప్పటి నుంచి మెగాఫ్యాన్స్‌లోని ఒక వర్గం అల్లు అర్జున్ తీరుపై గుర్రుగా ఉన్నారు. మొత్తానికి ‘సైరా’ విషయంలో అల్లు అర్జున్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 27, 2019, 11:48 AM IST