తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకే కాదు వాళ్ల భార్యలకు కూడా మంచి ఇమేజ్ ఉంది. వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంటారు. లక్షల కొద్దీ ఫాలోయర్స్ వాళ్ళకు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే అందరి కంటే కూడా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు ఆమెకు ఓ రకంగా అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. భార్యను అందంగా సిద్ధం చేసి ఆయనే ప్రమోట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు తన సతీమణి ఫోటోలను ట్విట్టర్, ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తుంటాడు అల్లు వారబ్బాయి. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. తాజాగా నిహారిక పెళ్లి కోసం అల్లువారి కుటుంబం అంతా కలిసి తమ సొంత ప్రైవేట్ జెట్‌లోనే ఉదయ్‌పూర్ వెళ్లారు. అక్కడికి వెళ్తున్నపుడు ఫ్లైట్‌లో కూడా ఫోటోషూట్ చేసాడు బన్నీ. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను భార్య పిల్లలు కలిసి అందులో వెళ్లారు. అందులోనే అల్లు అరవింద్ దంపతులు కూడా ఉన్నారు. అంతా కలిసి ఫోటోలకు బాగానే పోజులిచ్చారు.
అందులో ముఖ్యంగా తన భార్య స్నేహా రెడ్డి ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసాడు అల్లు అర్జున్. దాంతో పాటు క్యూటీ అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భార్యను బాగా పొగిడేస్తున్నావ్ గా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు సూపర్ వదిన అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ లైక్ చేస్తున్నారు. భార్యతో పాటు కూతురు, కొడుకు ఫోటోలను కూడా షేర్ చేసాడు అల్లు అర్జున్. బన్నీకి ఇన్‌స్టాలో బాగానే ఫాలోయర్స్ ఉన్నారు. దాంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే నిహారిక పెళ్లి కోసం కుటుంబం అంతా కలిసి రాజస్థాన్ ఉదయ్‌పూర్ కోటకు వెళ్లారు. అక్కడే మూడు రోజులు ఉండి.. డిసెంబర్ 12న హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది. వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోనే పుష్ప కొత్త షెడ్యూల్‌లో అడుగు పెట్టనున్నాడు అల్లు అర్జున్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Allu Arjun Wife Sneha Reddy, Telugu Cinema, Tollywood