చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ సరికొత్త సవాల్..

Allu Arjun: మొన్నటి వరకు నాన్ బాహుబలి అంటే రంగస్థలం సినిమా గుర్తుకొచ్చేది. కానీ అల వైకుంఠపురములో సినిమాతో అన్ని రికార్డులను తిరగరాసాడు బన్నీ. ఇప్పటి వరకు కెరీర్లో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ హీరో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2020, 8:49 PM IST
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్ సరికొత్త సవాల్..
అల్లు అర్జున్ (Twitter/allu arjun)
  • Share this:
మొన్నటి వరకు నాన్ బాహుబలి అంటే రంగస్థలం సినిమా గుర్తుకొచ్చేది. కానీ అల వైకుంఠపురములో సినిమాతో అన్ని రికార్డులను తిరగరాసాడు బన్నీ. ఇప్పటి వరకు కెరీర్లో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ హీరో.. తొలిసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధించింది. సంక్రాంతి సెలవులతో పాటు పండగ సీజన్ కూడా బాగానే వాడుకుంది అల వైకుంఠపురములో. ఫ్యామిలీస్ క్యూ కట్టడంతో బన్నీ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడిపోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 159 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటిని తిరగరాసింది.

అల్లు అర్జున్ చిరంజీవి సినిమాల కలెక్షన్స్ (Allu Arjun Chiranjeevi)
అల్లు అర్జున్ చిరంజీవి సినిమాల కలెక్షన్స్ (Allu Arjun Chiranjeevi)


దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి సహా అందరు హీరోలకు కొత్త లెక్కలు సెట్ చేసి పెట్టాడు అల్లు అర్జున్. పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఈయన టార్గెట్ 150 కోట్లుగా సెట్ చేసాడు బన్నీ. పింక్ రీమేక్‌కు ఇంత సత్తా ఉందా అనేది ఇప్పుడు అందరిలోనూ వస్తున్న అనుమానం. ఈ చిత్రం విజయం సాధించినా కూడా అన్ని కోట్లు వసూలు చేస్తుందా అంటే అనుమానమే. కానీ క్రిష్ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తుంది. కచ్చితంగా ఈ సినిమాకు వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. ఇక ప్రభాస్ సాహో సినిమాతోనే 200 కోట్లకు పైగా వసూలు చేసాడు. దాంతో ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ సినిమాతో బన్నీ రికార్డులను దాటేయాలని చూస్తున్నాడు.

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రంగస్థలం సినిమాల కలెక్షన్స్ (Allu Arjun ala Vaikuntapurramuloo)
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రంగస్థలం సినిమాల కలెక్షన్స్ (Allu Arjun ala Vaikuntapurramuloo)




మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో 120 కోట్ల షేర్ అయితే దాటాడు కానీ ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమాతో బన్నీ రికార్డులను కూడా టచ్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక చిరంజీవి కూడా లిస్టులోనే ఉన్నాడు. సైరా సినిమాతో ఈయన సృష్టించిన రికార్డులను తిరగరాసాడు బన్నీ. దాంతో ఇప్పుడు కొరటాల సినిమాతో అల్లు వారబ్బాయి సృష్టించిన రికార్డులను మళ్లీ తన పేర రాసుకోవాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఇదే ఏడాది కొరటాల సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ అయితే రాజమౌళి అండతో వస్తున్నారు కాబట్టి వాళ్లకు బన్నీ టార్గెట్ అసలు లెక్క కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా బన్నీ కొత్త రికార్డుల గురించే చర్చ జరుగుతుంది. కచ్చితంగా స్టార్ హీరోలు బన్నీ రికార్డులను తిరగరాసి.. మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఇది ఎప్పటికి తీరుతుందో చూడాలిక.
First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు