అల వైకుంఠపురములో.. అలా సామజవరగమనతో వస్తున్న అల్లు అర్జున్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 7, 2019, 7:46 PM IST
అల వైకుంఠపురములో.. అలా సామజవరగమనతో వస్తున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సామజవరగమనా అయితే సంచలనాలు రేపింది. ఈ పాట తెలుగు ఇండస్ట్రీలోనే మోస్ట్ లైక్డ్ పాటగా నిలిచిపోయింది. ఎప్పుడూ రొటీన్ ట్యూన్స్‌తో విసుగు పుట్టించే తమన్ మాటల మాంత్రికుడికి మాత్రం అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సామజవరగమనా ప్రోమో సాంగ్ కూడా విడుదల కానుంది. ఆన్ ది వే అంటూ అదిరిపోయే పోస్టర్ విడుదల చేసాడు బన్నీ.




సంచలన గాయకుడు సిడ్ శ్రీరామ్ ఈ పాటను పాడాడు. తమన్ అద్భుతమైన ట్యూన్ ఇవ్వడంతో సంచలన రికార్డులు నెలకొల్పింది. జనవరిలో సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్. అరవింద సమేత తర్వాత మరోసారి త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తుంది. ఇప్పటికే లిరికల్ సాంగ్ విడుదలైంది.. ఇప్పుడు ప్రోమో సాంగ్ కోసం సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసాడు త్రివిక్రమ్.
Ala Vaikuntapuramlo Samajavaragamana Out Soon and Allu Arjun fans are waiting pk అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి సింగిల్ విడుదల కానుందని.. allu arjun facebook,allu arjun instagram,Ala Vaikuntapuramlo Samajavaragamana,Trivikram Srinivas,Trivikram Srinivas twitter,Allu Arjun,Allu Arjun twitter,Ala Vaikuntapuramlo movie,Ala Vaikuntapuramlo movie teaser,Ala Vaikuntapuramlo movie teaser dasahara,telugu cinema,అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్,అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్,అల వైకుంఠపురములో,తెలుగు సినిమా
అల్లు అర్జున్ పూజా హెగ్డే

ఇక డీజే తర్వాత బన్నీతో మరోసారి జోడీ కట్టింది ఈ ముద్దుగుమ్మ. విడుదలకు ముందే ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. అల వైకుంఠపురములో డిజిటల్ రైట్స్ ఇప్పటికే సన్ నెక్స్ట్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ తీసుకుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. మరోసారి తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వస్తుంది ఈ చిత్రం.
First published: November 7, 2019, 7:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading