Home /News /movies /

ALLU ARJUN SENSATIONAL COMMENTS IN PRIYA PRAKASH VARRIERS LOVERS DAY PRE RELEASE EVENT TA

ప్రియా ప్రకాష్ వారియర్ ‘లవర్స్ డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రియా ప్రకాష్ వారియర్, అల్లు అర్జున్

ప్రియా ప్రకాష్ వారియర్, అల్లు అర్జున్

అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు కేరళలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీంతో మలబార్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ‘లవర్స్ డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్ని చేసిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...
    ‘నా పేరు నా ఇల్లు ఇండియా’ తర్వాత అల్లు అర్జున్ గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాడు. రీసెంట్‌గా త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పినా..అది సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టేటట్టు ఉంది. ఈ లోగా అల్లు అర్జున్..వేరే నటీనటులు నటించిన సినిమాలకు గెస్ట్‌గా వెళ్లి ఆయా సినిమాలను మంచిగా ప్రమోట్ చేస్తున్నాడు.

    అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు కేరళలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీంతో మలబార్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలో నటించిన ‘లవర్స్ డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్ని చేసిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

    ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్..తాను దక్షిణాది వాడిని అని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనుకాడనని చేసిన వ్యాఖ్యలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’లో ఒక డైలాగ్ ఉంది. అందులో దేశంలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా అంటూ ఇన్ని ఇండియాలు లేవు. ఉన్నది ఒక్కటే ఇండియా అంటూ చెప్పి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను దక్షిణాది వాడినని చెప్పుకోవడాన్ని చూసి మరికొంత మంది విభేదిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని విభజించేలా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్



    ఇవి కూడా చదవండి 

    నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుందా..

    కుక్కకు రూ.36 లక్షల జాకెట్... ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్

    బాహుబలి కోసం కట్టప్ప..RRR కోసం ఎవరు ? ఇంతకీ రాజమౌళి ప్లాన్ అదేనా..
    First published:

    Tags: Allu Arjun, Malayala Cinema, Malluwood, Priya Prakash Varrier, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు