Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 24, 2020, 7:20 PM IST
బుట్ట బొమ్మ వీడియో సాంగ్ (Butta Bomma song)
అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో‘ (Ala Vaikunthapurramuloo) విడుదలై 11 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే సంచలన విజయం సాధించాయి. తమన్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ ఈ ఆల్బమ్. సినిమా పరంగా దుమ్ము దులిపేసిన అల వైకుంఠపురములో పాటల విషయంలో కూడా సంచలనం సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమన్ కెరీర్లోనే ఇంతకంటే బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇక ఇవ్వలేడేమో అనేంతగా రెచ్చిపోయాడు. ఆ ట్యూన్స్ ఇప్పటికీ రప్ఫాడిస్తున్నాయి. పైగా కేవలం దీని కోసమే అప్పట్లో మ్యూజికల్ నైట్ కూడా చేసాడు త్రివిక్రమ్. తన సినిమాకు టికెట్స్ తెగడంలో తమన్ పాత్ర చాలా ఉందని క్రెడిట్ కూడా ఇచ్చాడు మాటల మాంత్రికుడు.

బుట్టబొమ్మ పాటకు 400 మిలియన్ వ్యూస్ (butta bomma 400 million)
ఇక రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ పాట మొదట్లో కాస్త నెమ్మదిగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం దుమ్ము దులిపేసింది. నిదానమే ప్రధానం అన్నట్లు.. టిక్ టాక్, డబ్ స్మాష్ ఎక్కడ చూసినా కూడా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 450 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. మరో 150 మిలియన్స్ అందుకోడానికి మూడు నెలల సమయం తీసుకుంది. 450 మిలియన్ వ్యూస్ అంటే చిన్న విషయం కాదు. అది చేసి చూపించింది బుట్టబొమ్మ.
ఈ చిత్రంలోని 'రాములో రాములా' సాంగ్ 240 మిలియన్ వ్యూస్ అందుకుంది. 'సామజవరగమన' కూడా 218 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు బుట్టబొమ్మ కూడా 450 మిలియన్ క్లబ్లో జాయిన్ అయిపోయింది. అత్యంత వేగంగా 450 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న తొలిపాట బుట్టబొమ్మ అంటూ పండగ చేసుకుంటున్నారు టీం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఓమై గాడ్ డాడీ, టైటిల్ సాంగ్, సిత్తరాల సిరపడు పాటలు కూడా సంచలనం విజయం సాధించాయి. మొత్తానికి తమన్ కెరీర్లో అల వైకుంఠపురములో అలా ప్రత్యేకంగా నిలిచిపోయిందన్నమాట.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 24, 2020, 7:19 PM IST