వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ జోరుకు ఊహించని బ్రేకులు వేసిన సినిమా నా పేరు సూర్య. వక్కంతం వంశీ కథను నమ్మి ఈ చిత్రం చేసాడు అల్లు అర్జున్. కానీ ఈ చిత్రం మాత్రం ఆయన నమ్మకాన్ని నిలబెట్టకపోగా కథల ఎంపికలో జాగ్రత్త తీసుకోకపోతే అసలుకే నష్టం వస్తుందని విమర్శలు కూడా తీసుకొచ్చింది. దాంతో చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. నా పేరు సూర్య వచ్చి ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు. బన్నీ తన కెరీర్లో ఓ ఏడాదిని ఖాళీగా వదిలేయడం ఇదే తొలిసారి కూడా.
2003లో ఇండస్ట్రీకి వచ్చిన బన్నీ.. ఇప్పటి వరకు ఒక్క కేలండర్ ఇయర్ కూడా సినిమా లేకుండా ఉండలేదు. కానీ ఇప్పుడు అలా జరుగుతుంది. 2019లో ఒక్క సినిమా కూడా చేయడం లేదు ఈయన. దాంతో బన్నీ గ్యాప్ తీసుకోవడంపై బయట కూడా సెటైర్లు పడుతున్నాయి. కథల ఎంపిక ఆలస్యం కావడం వల్లే లేట్ అయిందని కొందరు అంటుంటే.. కాదు భయపడుతున్నాడు.. ఒక్క ఫ్లాపుకే జంకాడు అంటూ బన్నీపై ట్రోలింగ్ కూడా నడిచింది.
దాంతో ఇప్పుడు తనపై తనే దిమ్మ తిరిగిపోయే సెటైర్ వేసుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా విడుదలైన త్రివిక్రమ్ అల వైకుంఠపురములో టీజర్‌లో గ్యాప్ గురించి డైలాగ్ ఉంది. గ్యాప్ ఇచ్చావేంట్రా అని మురళీ శర్మ అంటే ఇవ్వలేదు.. అదే వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. సినిమాలో ఇది పార్ట్ అయినా కూడా బయట కూడా బాగానే వర్కవుట్ అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.
థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపిస్తానంటున్నాడు అల్లు వారబ్బాయి. త్రివిక్రమ్ కూడా అరవింద సమేతతో జస్ట్ ఓకే అనిపించాడే కానీ బ్లాక్ బస్టర్ కొట్టలేదు. దాంతో ఇప్పుడు ఈయన కూడా భారీ విజయానికి బాకీ పడ్డాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, Telugu Cinema, Tollywood, Trivikram