మాట నిలబెట్టుకున్నావ్ బ్రదర్.. తమన్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్..

Allu Arjun Thaman: అల వైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన పాటలు అందించాడు తమన్. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇది. ఈ చిత్రం విజయంలో తమన్ పాటలు కూడా కీలకమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2020, 2:28 PM IST
మాట నిలబెట్టుకున్నావ్ బ్రదర్.. తమన్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్..
థమన్‌కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ (allu arjun thaman)
  • Share this:
మాట ఇవ్వడానికి ఏముంది..? అంతా ఇస్తుంటారు. కానీ నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఓ మాట ఇచ్చిన తర్వాత దాని మీద నిలబడటం.. పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు తమన్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని బన్నీ ట్వీట్ చేసాడు. ఈయనకు ఏం మాటిచ్చాడు.. ఆయనేం నిలబెట్టుకున్నాడు అనుకుంటున్నారా..? ఈ ఏడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన పాటలు అందించాడు తమన్. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బమ్ ఇది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయంలో తమన్ పాటలు కూడా కీలకమే.


ఈ సినిమాకు మీరు టికెట్ ఎందుకు కొనరు అంటూ తమన్ తన పాటలతో ప్రశ్నించాడంటూ ఆయనపై త్రివిక్రమ్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలోని పాటలు 100 కోట్ల వ్యూస్ అందుకున్నాయి. దానికి బన్నీ కూడా చాలా సంతోషపడుతున్నాడు. ఈ సందర్భంగా తమన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.


తమన్ నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా.. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు బ్రదర్.. ఈ సినిమా పాటలు 100 కోట్ల వ్యూస్ రాబట్టాలని నిన్ను అడిగాను.. దానికి నువ్వు తప్పుకుండా బ్రదర్.. నీకు మాటిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావ్.. 1.13 బిలియన్ వ్యూస్ వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి అంటూ ట్వీట్ చేసాడు. దీనికి స్పందించిన తమన్ ఈ ట్వీట్‌ నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఈ ఇద్దరి సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: April 11, 2020, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading