అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా బన్నిదే..

Allu arjun : అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2016లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'సరైనోడు'. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది.

news18-telugu
Updated: July 16, 2020, 11:44 AM IST
అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఆ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమా బన్నిదే..
సరైనోడులో అల్లు అర్జున్ Photo : Twitter
  • Share this:
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2016లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'సరైనోడు'. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. మాస్‌ను ఆకట్టుకునే ఫైట్స్ , హుర్రాతలూగించే పాటలు, కుటుంబ నేపథ్యం ఇలా అన్ని సినిమాకు ప్లస్‌గా మారాయి. ఇవన్ని కలిసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించాయి. ఈ సినిమా ఇక్కడ ఘన విజయ సాధించిన తర్వాత హిందీలోకి డబ్ చేశారు. సరైనోడు తెలుగులో కన్న హిందీలో మరింత పెద్ద విజయాన్ని అందుకుంది. సరైనోడు పేరుతో హిందీలోకి డబ్బైన ఈ సినిమా యూట్యూబ్‌లో సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా యూట్యూబ్‌లో 300 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుని ఏ డబ్బింగ్ సినిమాకు రాని వ్యూస్‌తో చరిత్ర సృషించింది. ఈ విషయాన్ని ప్రముఖ ఫిల్మ్ అనలిష్ట్ కోమల్ నేతా తన ట్విట్టర్ అకౌంట్ రాస్తూ.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు హిందీ వెర్షన్ 300 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న మొదటి ఇండియన్ ఫిల్మ్‌గా చరిత్రకెక్కిందని పేర్కోన్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్, ఆది పినిశెట్టి, కెథరిన్ థ్రెసా, రకుల్ ప్రీత్ నటించారు. థమన్ సంగీతం అందించాడు.


ఇక అల్లు ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
Published by: Suresh Rachamalla
First published: July 16, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading