హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్‌ను అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్..

Allu Arjun - Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్‌ను అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్..

సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ (Twitter/Photo)

సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్ (Twitter/Photo)

Allu Arjun - Sai Dharam Tej : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను అపోలో ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్.. వివరాల్లోకి వెళితే..

  Allu Arjun - Sai Dharam Tej : చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ వినాయక చవితి రోజునై సెప్టెంబర్ 10న  హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ - ఐకియా సమీపంలో తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే నగరంలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఆయనకు చికిత్స అందించారు. ఇక ప్రస్తుతం సాయి తేజ్ హాస్పిటల్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఆయనకు పూర్తిగా నయం అయేంత వరకు కూడా అక్కడే ఉండబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు ఎలాంటి సమస్యలు రాలేదని వైద్యులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆయనకు కాలర్ బోన్ విరిగింది. దానికి సర్జరీ చేసారు.

  తాజాగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పరామర్శించారు. సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగిన సమయంలో బన్ని.. ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో భాగంగా తూర్పు గోదావరిలో ఎక్కువ మంది నటీనటులతో షూటింగ్ జరుగుతోంది. తన వల్ల మిగతా ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ చేయడం అంత సులభం కాదని తెలుసుకొని .. అక్కడ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ రోజు అపోలో హాస్పిటల్‌లో సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించారు.

  బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

  ఇప్పటికే సాయి ధరమ్ తేజ్‌ను  పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అపోలో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించి వచ్చారు. అభిమానులు కూడా సాయి తేజ్ త్వరగా కోలుకోవాలంటూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఈయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్‌లో విడుదల కానుంది.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇక ప్రమాదం జరిగిన రోజు నుంచి ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ వేగంతో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని కొందరు అనగా.. లేదు రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల జారిపడ్డాడు అంటూ మరికొందరు అంటున్నారు. ఇక ఈ విషయాలతో పాటు మరో విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన రోజు అక్కడ మహమ్మద్ ఫర్హాన్ అనే యువకుడు ఉండటంతో సాయి ధరమ్ తేజ్ ను కాపాడడానికి ముందుకు వచ్చాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Sai Dharam Tej, Tollywood