హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu-Allu Arjun : మంచు విష్ణు భారీ స్కాం.. సాయం చేసిన అల్లు అర్జున్..

Manchu Vishnu-Allu Arjun : మంచు విష్ణు భారీ స్కాం.. సాయం చేసిన అల్లు అర్జున్..

మంచు విష్ణు, అల్లు అర్జున్ Photo : Twitter

మంచు విష్ణు, అల్లు అర్జున్ Photo : Twitter

Manchu Vishnu : మంచు విష్ణు గతంలో చేసిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ భాషాల్లో 'మోసగాళ్లు' అనే సినిమా చేస్తున్నాడు.

  Manchu Vishnu : మంచు విష్ణు గతంలో చేసిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ భాషాల్లో 'మోసగాళ్లు' అనే సినిమా చేస్తున్నాడు. మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ఈ సినిమాకు సంబందించి పోస్టర్ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. కాగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం తాలూకు టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల స్కామ్ గురించి చూపించారు... భారీ ఎత్తున డబ్బుల బస్తాల నడుమ “ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే ఆటిప్పుడే మొదలయ్యింది” అంటూ విష్ణు అంటాడు. టీజర్ అనుకున్నదానికంటే ఎంతో బాగుందని అంటున్నారు. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.

  ఇక మంచు విష్ణు కెరీర్ చూస్తే.. స్టార్ హీరో కుమారుడిగా పరిచయమై విష్ణు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్నీ అలరించలేకపోయాయి. అయితే ఆయన చేసిన కొన్ని కామెడీ సినిమాలలో ఒకటిరెండు సినిమాలు పేలాయి. ఇంతవరకు కెరీర్‌ను టర్న్‌ చేసే స్థాయి సూపర్‌ హిట్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో సినిమాల నుంచి లాంగ్‌ గ్యాప్ తీసుకున్న విష్ణు.. మోసగాళ్లు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక  విష్ణు ఈ సినిమాతో పాటు మరో సినిమాలోను నటిస్తున్నాడు. విష్ణు ప్రధాన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కనున్న ఈ పౌరాణిక చిత్రంలో విష్ణు 'భక్త కన్నప్ప'గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమాలోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. మరోవైపు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ 'అహం బ్రహ్మస్మి' అనే భారీ పాన్ ఇండియా మూవీని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Manchu Vishnu

  ఉత్తమ కథలు