విజయ్ దేవరకొండ కెరీర్‌లో గీత గోవిందం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ ఈ కథను తీసుకొచ్చి విజయ్‌కు చెప్పాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దాదాపు 70 కోట్ల షేర్ తీసుకొచ్చి రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాతో అల్లు అరవింద్ దాదాపు 50 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ముందు విజయ్ దేవరకొండ చేయాల్సింది కాదు. ఈ కథను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసాడు పరశురామ్.
ఈ సినిమా కథ కూడా నచ్చింది.. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మాడు కూడా. పైగా గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కావడంతో బన్నీకి మరో సమస్య కూడా లేదు. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. సరైనోడు లాంటి సంచలన మాస్ సినిమా తర్వాత వెంటనే ఇంత సున్నితమైన లవ్ స్టోరీ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో గీత గోవిందం సినిమాను వదిలేసుకున్నాడు బన్నీ.
దాంతో అప్పటికే పెళ్లి చూపులు లాంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌తో ఈ సినిమా చేసాడు. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు.. కానీ గీత గోవిందం షూటింగ్ మొదలైన తర్వాత అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించింది. ఆ సమయంలో విజయ్ ఇమేజ్ చూసి ఈ కథకు ఇతడు సరైనోడా కాదా అని అల్లు అరవింద్ భయపడినా కూడా దర్శకుడు పరశురామ్ మాత్రం విజయ్ దేవరకొండపై నమ్మకంగా ఉన్నాడు. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Geetha govindam, Telugu Cinema, Tollywood