Pushpa - Allu Arjun - Rashmika : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల.. అదిరిన బన్ని, రష్మిక కాంబినేషన్..

‘పుష్ప’ మూవీ నుంచి శ్రీవల్లి సాంగ్ (Twitter/Photo)

Pushpa - Allu Arjun - Rashmika :‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న మూవీ ‘పుష్ప’.  సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి.

  • Share this:
    Pushpa - Allu Arjun - Rashmika :‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న మూవీ ‘పుష్ప’.  సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల చేసారు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారారు. ఈ  సినిమాను  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.  ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రష్మిక మందన్న లుక్ విడుదలైంది.

    పుష్పలో రష్మిక లుక్ చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా‌ లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో చీరకట్టులో ఉన్న లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ప్రస్తుతం ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. తాజాగా ఈ  సినిమా నుంచి రెండో పాటను దసరా సందర్భంగా విడుదల చేశారు.  అది కూడా ఐదు భాషల్లో విడుదల చేసారు ‘చూపే బంగారమాయనే శ్రీవల్లీ’ అంటూ సాగే పాటను తెలుగులో సిద్ శ్రీరామ్ పాడారు. చంద్రబోస్ రాసిన ఈ గీతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

    చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

    ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా.

    Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే  వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే.  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 17న  ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: