Home /News /movies /

ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMARS PUSHPA MOVIE HINDI VERSION TO RELEASE IN OVERSEAS TA

Allu Arjun - Pushpa : అక్కడ తొలిసారి అల్లు అర్జున్ ‘పుష్ప’ విడుదల.. కండిషన్స్ అప్లై..

ఈ సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీనికి ఇప్పుడు సమాధానం వచ్చేసింది. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో వస్తుంది. అయితే తెలుగులో మాత్రం కొన్ని పెద్ద సినిమాలకు 50 రోజుల గ్యాప్ ఉండాలని నిర్మాతలు ఈ మధ్యే నిర్ణయించుకున్నారు.

ఈ సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. దీనికి ఇప్పుడు సమాధానం వచ్చేసింది. ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజుల్లోనే ఓటిటిలో వస్తుంది. అయితే తెలుగులో మాత్రం కొన్ని పెద్ద సినిమాలకు 50 రోజుల గ్యాప్ ఉండాలని నిర్మాతలు ఈ మధ్యే నిర్ణయించుకున్నారు.

Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

    Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది.  అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప.  మొత్తంగా ఫస్ట్ వీక్ హిందీలో 22. 40 షేర్.. దాదాపు రూ. 68 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు.

    ఈ సినిమా హిందీ వెర్షన్ ఇరగదీస్తుండంతో ఈ సినిమాను ఇపుడు ఓవర్సీస్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7న ’పుష్ప’ హిందీ వెర్షన్‌ను ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. మొత్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, 2.O, 'సాహో’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెరకెక్కింది.

    NBK 107 : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్..


    పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగారూ.  100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 19 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

    నైజాం (తెలంగాణ): 40.30 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)
    సీడెడ్ (రాయలసీమ): 14.82 కోట్లు / 18 కోట్లు
    ఉత్తరాంధ్ర: 7.95 కోట్లు / 12.25 కోట్లు
    ఈస్ట్: 4.80 కోట్లు / 8 కోట్లు
    వెస్ట్: 3.91 కోట్లు / 7 కోట్లు
    గుంటూరు: 5.01 కోట్లు / 9 కోట్లు
    కృష్ణా: 4.15కోట్లు / 7.5 కోట్లు
    నెల్లూరు: 3.06 కోట్లు / 4 కోట్లు

    ఏపీ-తెలంగాణ టోటల్: 84.00 కోట్లు / 101.75 కోట్లు మొత్తంగా రూ. 130.82 గ్రాస్ కలెక్షన్స్..
    తమిళనాడు: 10.46 కోట్లు / 6 కోట్లు
    కర్ణాటక: 11.25 కోట్లు / 9 కోట్లు
    హిందీ: 32.10 కోట్లు / 10 కోట్లు
    ఓవర్సీస్: 14.18 కోట్లు / 13 కోట్లు
    రెస్టాఫ్ ఇండియా: 2.20 కోట్లు / 1.15 కోట్లు
    కేరళ: 5.25 కోట్లు / 4 కోట్లు
    19 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 159.44 కోట్లు (300.25 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

    పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. 19 రోజుల్లో ఈ సినిమాకు రూ.  159.44 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా రూ. 7.28 కోట్లు వస్తే హిట్ అనిపించకుంటోంది  ప్రస్తుతానికి ‘పుష్ప’ సినిమాకు ‘RRR’ , ‘రాధే శ్యామ్’ సినిమాలు పోటీలో లేకపోవడంతో ‘పుష్ప’ 3 వారం తర్వాత 4 వారంలో కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు