హోమ్ /వార్తలు /సినిమా /

Pushpa 20 Days Collections : అల్లు అర్జున్ ‘పుష్ప’ 20 రోజుల కలెక్షన్స్.. తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్..

Pushpa 20 Days Collections : అల్లు అర్జున్ ‘పుష్ప’ 20 రోజుల కలెక్షన్స్.. తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్..

Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే..

Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే..

Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే..

ఇంకా చదవండి ...

  Allu Arjun - Pushpa | ఐకాన్ స్టార్  అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్‌ మంచి వసూళ్లనే దక్కించుకుంది. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టింది.  అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. మొత్తంగా హిందీలో 20 రోజుల్లో.. రూ. 33.15 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  కొన్నిచోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇప్పటికే బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి హీరోలు ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా.

  ఈ సినిమా హిందీ వెర్షన్ ఇరగదీస్తుండంతో ఈ సినిమాను తాజాగా 100కు పైగా లొకేషన్స్‌లో ఈ రోజు  ఓవర్సీస్‌లో విడుదల చేసారు.  ఇక మన దేశంలో నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తోంది. మొత్తంగా హిందీ వెర్షన్ మొత్తం రూ. 100 కోట్ల గ్రాస్‌కు చేరువలో ఉంది. మొత్తంగా రూ. 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. అంతేకాదు 2021 లో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి, 2.O, 'సాహో’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ, ఓవర్సీస్, మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.33 కోట్లు వసూళ్లు సాధించింది.

  ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు రూ. 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా రూ.  100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా రూ. 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఈ సినిమా 20 రోజులకు  గాను ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళు చేసిందంటే..

  నైజాం (తెలంగాణ): 40.34 కోట్లు (వచ్చింది)/ 36.00 (అమ్మింది)

  సీడెడ్ (రాయలసీమ): 14.86 కోట్లు / 18 కోట్లు

  ఉత్తరాంధ్ర: 7.97 కోట్లు / 12.25 కోట్లు

  ఈస్ట్: 4.81 కోట్లు / 8 కోట్లు

  వెస్ట్: 3.92 కోట్లు / 7 కోట్లు

  గుంటూరు: 5.02 కోట్లు / 9 కోట్లు

  కృష్ణా: 4.16కోట్లు / 7.5 కోట్లు

  నెల్లూరు: 3.06 కోట్లు / 4 కోట్లు

  ఏపీ-తెలంగాణ టోటల్: 84.14 కోట్లు / 101.75 కోట్లు మొత్తంగా రూ. 130.82 గ్రాస్ కలెక్షన్స్..

  తమిళనాడు: 10.49 కోట్లు / 6 కోట్లు

  కర్ణాటక: 11.30 కోట్లు / 9 కోట్లు

  హిందీ: 33.15 కోట్లు / 10 కోట్లు

  ఓవర్సీస్: 14.21 కోట్లు / 13 కోట్లు

  రెస్టాఫ్ ఇండియా: 2.21 కోట్లు / 1.15 కోట్లు

  కేరళ: 5.27 కోట్లు / 4 కోట్లు

  20 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 160.77 కోట్లు (303.00 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు

  Akhanda 5 Weeks collections: ‘అఖండ’ 5 వారాల కలెక్షన్స్.. 35వ రోజు కూడా తగ్గని బాలయ్య జోరు..


  పుష్ప సినిమాకు రూ.  145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఏపీలో పలు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. ఓవరాల్‌గా లాభాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్ రేపటి నుంచి (జనవరి 7) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 20 రోజుల్లో ఈ సినిమాకు రూ.  160.77 కోట్ల షేర్ వచ్చింది. ప్రస్తుతానికి ‘పుష్ప’ సినిమాకు ‘RRR’ , ‘రాధే శ్యామ్’ సినిమాలు పోటీలో లేకపోవడం కలిసొచ్చే అంశం. మరోవైపు హిందీ తప్ప మిగతా భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

  First published:

  Tags: Allu Arjun, Pushpa Movie, Tollywood, Tollywood Box Office Report

  ఉత్తమ కథలు