Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ఫ’ షూటింగ్‌కు ముహూర్తం ప్లేస్ ఖరారు..

Allu Arjun Rashmika Mandanna  Sukumar Pushpa Shooting | సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘పుష్ఫ’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌‌కు ముహూర్తంతో ప్లేస్ కూడా ఖరారైంది.

news18-telugu
Updated: October 29, 2020, 10:07 AM IST
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ఫ’ షూటింగ్‌కు ముహూర్తం ప్లేస్ ఖరారు..
అల్లు అర్జున్ ‘పుష్ఫ’ షూటింగ్ (Twitter/Photo)
  • Share this:
Allu Arjun Rashmika Mandanna  Sukumar Pushpa  | ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు.  ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది.  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి..సుకుమార్ దర్శకత్వలో ‘పుష్ప’సినిమాకు ఓకే చెప్పాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2  సినిమాలు వచ్చాయి. అందులో ఆర్య బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిస్తే.. ఆర్య 2 మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం.

Allu Arjun Rashmika Mandanna Sukumar Pushpa Shooting Stats from Novermer 5th here are the details,Allu Arjun pushpa,Allu Arjun Rashmika Mandanna,Allu Arjun Rashmika Mandanna Pushpa,pushpa shoot starts from november, item song, shraddha kapoor, kiara advani, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ,పుష్ఫ షూటింగ్ స్టార్ట్
అల్లు అర్జున్ ‘పుష్ఫ’ షూటింగ్ (Twitter/Photo)


అల్లు అర్జున్ ‘పుష్ఫ’ (Twitter/Photo)


రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)


సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను కేరళ అడవుల్లో కాకుండా.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవం అడవుల్లో ఈ సినిమాను  నవంబర్ 5న  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూపల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో  పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు.  ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

Allu Arjun Rashmika Mandanna Sukumar Pushpa Movie starts from November,Allu Arjun pushpa,Allu Arjun Rashmika Mandanna,Allu Arjun Rashmika Mandanna Pushpa,pushpa shoot starts from november, item song, shraddha kapoor, kiara advani, Allu Arjun pushpa twitter, Allu Arjun Pushpa, sukumars next film,allu arjun,allu arjun movies,allu arjun new movie,allu arjun latest movie,allu arjun sukumar movie,allu arjun songs,allu arjun sukumar movie launch,allu arjun sukumar movie updates,allu arjun becomes a lorry driver in sukumar movie,allu arjun sukumar new movie updates,allu arjun new song,sukumar,allu arjun as lorry driver,balakrishna lorry driver movie parts,allu arjun becomes a lorry driver, పుష్ప, అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన, కియారా అద్వానీ,పుష్ఫ షూటింగ్ స్టార్ట్
అల్లు అర్జున్, రష్మిక మందన్న (file/Photos)
ఆ తర్వాత షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఒకపుడు సత్య మంగళం అడవులు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడ్డాగా ఉండేది. ఇపుడు అక్కడే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ సంపాదించే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 29, 2020, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading