Home /News /movies /

ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMAR PUSHPA RUN TIME FIXED CENSOR CERTIFICATE GOES VIRAL TA

Allu Arjun - Pushpa : అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..

’పుష్ఫ’ రన్ టైమ్ (Pushpa Tease Photo : Twitter)

’పుష్ఫ’ రన్ టైమ్ (Pushpa Tease Photo : Twitter)

Allu Arjun - Pushpa Censor Certificate | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ ఎంతంటే..

    Allu Arjun - Pushpa Censor Certificate | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే  ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల సుకుమార్.. ఈ ప్రీ రిలీజ్‌కు గైర్హాజరవ్వడం అందరిని ఆశ్యర్యపోయేలా చేసింది.

    ఇక ఈ సినిమా కోసం కష్ట పడిన చిత్రబృందానికి అల్లు అర్జున్ డజను మంది ముఖ్య సభ్యులకు ఒక్కొక్కరికి 10 గ్రాముల చొప్పున బంగారు ఉంగరాలను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. ఈ సినిమా నిడివి 179. 51 నిమిషాలుంది. అంటే 2 గంటల 59 నిమిషాల 51 సెకండ్స్ ఫిక్స్ చేసారు.

    ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఉ అంటావా మావ.. ఉఉ అంటావా మావా అంటూ సాగే ఈ పాట ఇప్పటికే సంచలనం రేపుతుంది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది స్యామ్ సాంగ్.
    ‘పుష్ప’ మూవీ సెన్సార్ సర్టిఫికేట్ (Twitter/Photo)


    ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.

    మహేష్ బాబు, నమ్రత బాటలో గప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న ఈ సినీ జంటలు తెలుసా..

    మరోవైపు ఈ చిత్రం విడుదలకు దగ్గరవ్వడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా‌ లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తికరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.

    Akhanda : అఖండ దూకుడు ముందు ఐదేళ్ల ఆ రికార్డ్ ఫసక్.. బాలకృష్ణ మాస్ బీభత్సం..

    ఈ సినిమా టోటల్‌గా అన్ని భాషల్లో కలిసి రూ. 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ త‌గ్గేదేలె అనిపిస్తుంది. భారీ అంచ‌నాల‌తో డిసెంబ‌ర్ 17న 5 భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల కాబోతుంది ఐకాన్ స్టార్ అర్జున్ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఇందులో విలన్. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఉ అంటావా మావ.. ఉఉ అంటావా మావా అంటూ సాగే ఈ పాట ఇప్పటికే సంచలనం రేపుతుంది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది స్యామ్ సాంగ్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Mythri Movie Makers, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Tollywood

    తదుపరి వార్తలు