• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMAR PUSHPA MOVIE STARTS FROM NOVEMBER TA

Allu Arjun Pushpa: అల్లు అర్జున్, రష్మిక పుష్ఫ షూటింగ్ ప్రారంభం అయ్యేది.. అపుడే..

Allu Arjun Pushpa: అల్లు అర్జున్, రష్మిక పుష్ఫ షూటింగ్ ప్రారంభం అయ్యేది.. అపుడే..

అల్లు అర్జున్, రష్మిక మందన్న (file/Photos)

Allu Arjun Rashmika Mandanna Pushpa  | ఈ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఎపుడు ప్రారంభిస్తున్నారంటే..

  • Share this:
    Allu Arjun Rashmika Mandanna Pushpa  | ఈ ఇయర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో  భారీ కమర్షియల్ హిట్ ని సాధించి.. తన సత్తా ఏమిటో నిరూపించాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ ఇమేజ్ ని భారీగా పెంచేసింది. ఆ సినిమా తర్వాత బన్ని కొంత గ్యాప్ ఇచ్చి..సుకుమార్ దర్శకత్వలో ‘పుష్ప’సినిమాకు ఓకే చెప్పాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం.

    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)


    ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. ఇక ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది.

    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)
    పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Twitter/Pushpa Movie)


    సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను కేరళ అడవుల్లో కాకుండా.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవం అడవుల్లో ఈ సినిమాను షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు రష్మికతో పాటు పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

    Forest Department given unexpected shock to Allu Arjun and Sukumar movie by rejecting permission for shoot pk రంగస్థలం తర్వాత సుకుమార్ కెరీర్ వేగంగా వెళ్తుంది అనుకుంటే అనుకోని బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు పైగా గ్యాప్ తీసుకుని మహేష్ బాబుతో సినిమా ఓకే చేసినా కూడా ఆయన చివరి నిమిషంలో.. allu arjun,aa19,aa20,aa 20 sukumar,allu arjun new movie,allu arjun sukumar movie forest department,sukumar forest department,allu arjun sukumar,allu arjun sukumar movie starts,allu arjun sukumar rashmika mandanna movie starts,sukumar,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun about sukumar,allu arjun twitter,allu arjun instagram,allu arjun facebook,allu arjun upcoming movie,allu arjun dance,allu arjun 20th movie,allu arjun sukumar new movie,allu arjun sukumar movie updates,allu arjun songs,allu arjun new look,sukumar about allu arjun,allu arjun latest movie,allu arjun new movie 2019,allu arjun 20th movie updates,rashmika mandanna facebook,rashmika mandanna twitter,rashmika mandanna instagram,sukumar instagram,sukumar facebook,sukumar twitter,mythri movie makers,mythri movie makers twitter,అల్లు అర్జున్,సుకుమార్,అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు అనుమతి నిరాకరణ,అటవీశాఖ అధికారులు సుకుమార్,రష్మిక మందన్న,అల్లు అర్జున్ సుకుమార్,అల్లు అర్జున్ రష్మిక మందన్న,అల్లు అర్జున్ రష్మిక మందన్న సుకుమార్,మైత్రీ మూవీ మేకర్స్
    అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)


    ఆ తర్వాత షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేసారు. ఒకపుడు సత్య మంగళం అడవులు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడ్డాగా ఉండేది. ఇపుడు అక్కడే ఈ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ సంపాదించే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ వరకు పూర్తి చేసి మేలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: