Home /News /movies /

ALLU ARJUN RASHMIKA MANDANNA PUSHPA COLLECTS GETS GOOD RESPONSE IN HINDI STATES PROVES CONTENT IS KING ONE MORE TIME SR

Pushpa | Allu Arjun : హిందీలో ఇరగదీస్తోన్న పుష్ప.. కంటెంట్ ఈజ్ కింగ్.. మరోసారి నిరూపితం..

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

    Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. నార్త్‌లో పుష్ప రాజ్ తన సత్తాను చాటుతున్నారు. అక్కడ హిందీ స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే రెస్పాన్స్ దక్కించుకుంటోంది పుష్ప. కొన్ని చోట్ల వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్స్ పడుతుండడం మామూలు విషయం కాదంటున్నారు సినీ పండితులు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుష్ప రోజుకి 3 కోట్ల వసూళ్లకు తగ్గకుండా వస్తుండడం అనేది మరో గొప్ప విషయం అంటున్నారు. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మరోసారి స్పష్టం అయ్యిందని అంటున్నారు.  పుష్ప హిందీ మార్కెట్‌లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. శనివారం రోజునా ఈ సినిమా 3.75 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం 32 కోట్లకు చేరుకుంది.

    పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు.







    ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్ల‌కు బిజినెస్‌ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిపారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి వచ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

    పుష్పను తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు.

    Prabhas | Radhe Shyam : రాధేశ్యామ్ కోసం రంగంలోకి థమన్... ఇక దబిడి దిబిడే..

    ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుపుకుంది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు