Home /News /movies /

ALLU ARJUN RASHMIKA MANDANNA PUSHPA COLLECTS 100CR SHARE IN FIVE DAYS WORLDWIDE HERE ARE THE DETAILS SR

Pushpa | Allu Arjun : బాక్సాఫీస్ దగ్గర పుష్ప బీభత్సం... ఐదు రోజుల్లో 100 కోట్ల షేర్..

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun Pushpa Photo : Twitter

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

  Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు సినీ పండితులు. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించిందని తెలుస్తోంది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు రోజులకి గాను పుష్ప సినిమా 116 కోట్ల భారీ వసూళ్లను అందుకున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాలలో 3.87 కోట్ల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. అయితే ఇతర భాషల కలెక్షన్స్ బాగున్నాయి. హిందీలో, తమిళ్ లో, కన్నడలో సాధిస్తున్న కలెక్షన్స్ గ్రోత్ వలన సినిమా ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.

  5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…

  Nizam: 31.11Cr (inc GST)
  Ceeded: 10.56Cr
  UA: 5.55Cr
  East: 3.72Cr
  West: 3.12Cr
  Guntur: 4.04Cr
  Krishna: 3.30Cr
  Nellore: 2.37Cr
  AP-TG Total:- 63.77CR(96.05CR~ Gross)
  Karnataka: 8.45Cr
  Tamilnadu: 6.85Cr
  Kerala: 2.91Cr
  Hindi: 9.90Cr
  ROI: 1.96Cr
  OS – 9.41Cr
  Total WW: 103.25CR(177CR~ Gross)

  ఈ సినిమా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దింపగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 42.75 కోట్ల షేర్‌ని అందుకోవాల్సి ఉంది. చూడాలి మరి ఈ సినిమా ముందు ముందు ఎలా సాధించనుందో.. ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్ల‌కు బిజినెస్‌ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిపారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి వచ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.


  పుష్పను తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు.

  Janhvi Kapoor : శ్రీదేవి కూతురు పరువాల విందు.. అదిరే అందాలతో కేక పెట్టిస్తోన్న జాన్వీ...

  ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుపుకుంది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Tollywood news

  తదుపరి వార్తలు