• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN RARE RECORD HIS ALA VAIKUNTHAPURRAMLOO AFTER BUTTA BOMMA SONG RAMULO RAMULO FULL VIDEO SONG CROSS 100 MILLION VIEWS TA

అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. 100 M క్లబ్‌లో రాములో రాములా సాంగ్..

అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. 100 M క్లబ్‌లో రాములో రాములా సాంగ్..

అల వైకుంఠపురములో ‘రాములో రాములా’ సాంగ్ విడుదల (Twitter/Photo)

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ తర్వాత రాములో రాములా ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.

  • Share this:
    ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములో, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. రిలీజ్‌కు ముందే రాములో రాములో యూట్యూబ్‌లో లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది. విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో పాటలు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో160 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈసినిమాలోని రాములో రాములో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతకు ముందు రాములో రాములో లిరికల్ వీడియో సాంగ్ 260 వ్యూస్ రాబట్టింది. మొత్తంగా 350కి పైగా మిలియన్ వ్యూస్‌ సంపాదించింది. మొత్తంగా అల వైకుంఠపుమురములో సాంగ్స్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.  మొత్తంగా ఈ సినిమాలోని రెండు సాంగ్స్ వంద మిలియన్ వ్యూస్ తక్కువ సమయంలో రాబట్టం ఒక రికార్డు అనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు