• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLU ARJUN RARE RECORD HIS ALA VAIKUNTHAPURRAMLLL BUTTA BOMMA SONG CREATS NEW RECORD GOING TO 100 MILLION VIEWS TA

అల్లు అర్జున్ రేర్ రికార్డు.. తెలుగులో ఈ ఘనత సాధించిన మొదటి హీరో బన్ని..

అల్లు అర్జున్ రేర్ రికార్డు.. తెలుగులో ఈ ఘనత సాధించిన మొదటి హీరో బన్ని..

అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

  • Share this:
    ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా ప్రదర్శితమై మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. నెల రోజుల క్రతం ఈ సినిమాకు సంబంధించిన ‘బుట్ట బొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నెల రోజుల్లోనే ‘బుట్ట బొమ్మ సాంగ్ 98 మిలియన్ వ్యూస్ దక్కించుకోని నేడో..రేపో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోనుంది. ఇంత తక్కువ సమయంలో బుట్ట బొమ్మ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సంపాదించడం రికార్డు అనే చెప్పాలి.

    అంతకు ముందు బుట్ట బొమ్మ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 51 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మొత్తంగా చూసుకుంటే.. ఈ పాట 150 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. అంతకు ముందు ఈ సినిమాకు సంబంధించిన రాములో రాములా లిరికల్ వీడియో  240 మిలియన్ వ్యూస్ సాధిస్తే..  సామజవరగమన లిరికల్ వీడియో 178మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. తెలుగులో ఒక హీరో నటించిన ఒక సినిమాలోని పాటలకు ఇన్ని వ్యూస్ రావడం రికార్డు అనే చెప్పాలి. మొత్తంగా తెలుగులో ఒక హీరో నటించిన ఇన్ని పాటలు, లిరికల్, ఫుల్ వీడియో సాంగ్స్ కలిపి ఇన్ని వ్యూస్ దక్కించుకున్న హీరోగా అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు