‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ మరో రికార్డు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బన్ని..

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ దక్కించుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

news18-telugu
Updated: May 3, 2020, 12:39 PM IST
‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ మరో రికార్డు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బన్ని..
అల వైకుఠపురములో అల్లు అర్జున్ (Ala Vaikuntapurramuloo)
  • Share this:
ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. అంతేకాదు ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా ప్రదర్శితమై మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. రెండు నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ‘బుట్ట బొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. నెల రోజుల్లోనే ‘బుట్ట బొమ్మ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. కేవలం రెండు నెలల్లో బుట్ట బొమ్మ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ సంపాదించడం రికార్డు అనే చెప్పాలి.

అంతకు ముందు బుట్ట బొమ్మ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 51 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మొత్తంగా చూసుకుంటే.. ఈ పాట 200 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. అంతకు ముందు ఈ సినిమాకు సంబంధించిన రాములో రాములా లిరికల్ వీడియో  240 మిలియన్ వ్యూస్ సాధిస్తే..  సామజవరగమన లిరికల్ వీడియో 178మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది. తెలుగులో ఒక హీరో నటించిన ఒక సినిమాలోని పాటలకు ఇన్ని వ్యూస్ రావడం రికార్డు అనే చెప్పాలి. మొత్తంగా తెలుగులో ఒక హీరో నటించిన ఇన్ని పాటలు, లిరికల్, ఫుల్ వీడియో సాంగ్స్ కలిపి ఇన్ని వ్యూస్ దక్కించుకున్న హీరోగా అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 3, 2020, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading