హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun Ramulo Ramula: అల్లు అర్జున్ ’రాములో రాముల ‘ పాట మరో అరుదైన రికార్డు..

Allu Arjun Ramulo Ramula: అల్లు అర్జున్ ’రాములో రాముల ‘ పాట మరో అరుదైన రికార్డు..

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ (Twitter/Photo)

Allu Arjun Ala Vaikunthapurramloo Ramulo Ramula | గతేడాది  సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘రాములో రాముల’ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది.

ఇంకా చదవండి ...

Allu Arjun Ala Vaikunthapurramloo Ramulo Ramula | గతేడాది  సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములో, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. రిలీజ్‌కు ముందే రాములో రాములో యూట్యూబ్‌లో లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో పాటలు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బుట్టబొమ్మ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 534 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టి ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

మరోవైపు ఈ సినిమాలోని ‘సామజవరగమన’ ఫుల్ వీడియో సాంగ్ 163 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని రాములో రాములో ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో తాజాగా 300 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

' isDesktop="true" id="758146" youtubeid="Bg8Yb9zGYyA" category="movies">

ఇక రాములో రాములో లిరికల్ వీడియో సాంగ్ 343 మిలియన్ వ్యూస్ రాబట్టింది. మొత్తంగా ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్‌లోని రాములో రాముల పాట మొత్తంగా 643 మిలియన్ వ్యూస్‌‌‌ను ‌ సంపాదించింది. తెలుగులో ఓ పాట ఈ రేంజ్‌లో రెస్పాన్స్ తెచ్చుకోవడం పెద్ద విశేషమే. మొత్తంగా తెలుగులో రాములో రాములో లిరికల్, ఫుల్ వీడియో కలిపితే.. ఈ పాటనే ఎక్కువగా చూసారు యూట్యూబ్‌లో. మొత్తంగా కరోనా కారణంగా కొత్త సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఈ సినిమాలోని పాటలనే హమ్ చేసారు. కానీ సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదలైన ఇప్పటికీ ‘అల వైకుంఠపురములో’ పాటలు యూట్యూబ్‌లో దుమ్ము దులపడం విశేషం. మొత్తంగా  ఏదైనా సెన్సేషన్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చే వరకు  ‘అల వైకుంఠపుమురములో’  దూకుడును ఆపడం అంత ఈజీ కాదనే చెప్పాలి.  మొత్తంగా ఈ సినిమాలోని సాంగ్స్ ‌ వందల మిలియన్ వ్యూస్‌ను తక్కువ సమయంలో రాబట్టడం ఒక రికార్డు అనే చెప్పాలి.

First published:

Tags: Ala Vaikunthapurramloo, Allu Arjun, Tollywood, Trivikram

ఉత్తమ కథలు